పెద్దలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా ప్రారంభం

52చూసినవారు
పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆయుష్మాన్‌ భారత్‌ PMJAY కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని మోడీ మంగళవారం ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, తొమ్మిదో ఆయుర్వేద డే సందర్భంగా ఈ పథకానికి ప్రధాని శ్రీకారం చుట్టారు. గర్భిణులు, చిన్నారుల వ్యాక్సినేషన్‌ కోసం యూ-విన్‌ పోర్టల్‌‌ను కూడా ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్