'పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో వేసుకోవడానికి శాశ్వత భూరక్ష చట్టం పేరుతో రూ.13 కోట్లు ఖర్చు పెట్టారు. వైఎస్సార్ భూరక్ష పేరుతో సర్వే చేసి, రాళ్లపై బొమ్మలు వేసుకున్నారు. ఆ గ్రానైట్ రాళ్ల కొనుగోలుకు రూ.640 కోట్లు ఖర్చు పెట్టేశారు.
వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలపై టోల్ ఫ్రీ నంబర్ ప్రకటిస్తాం.. వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి ఆ భూమిని బాధితులకు అప్పగిస్తాం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.