రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ధర్మశాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో భార్యాభర్తలు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నలుగురూ డెహ్రాడూన్ వాసులుగా పోలీసులు చెబుతున్నారు. జనవరి 12న వీరు ఇక్కడకు వచ్చారు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.