AP: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.963.93 కోట్లు మంజూరు చేసింది. NH-16పై ఉన్న అనకాపల్లి - ఆనందపురంను కలుపుతూ 6 లైన్ హైవే కోసం నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ ట్వీట్ చేశారు. 12.66 కి.మీ మేర చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం గ్రామంలో ప్రారంభమై విశాఖ జిల్లా షీలానగర్ జంక్షన్ వద్ద ముగియనుంది. దీంతో విశాఖ పోర్టుకు కనెక్టివిటీ పెరగడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.