ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో 14 అంశాలపై చర్చించనున్నారు. అమరావతిలో రూ.2,723 కోట్లతో చేపట్టనున్న పనులు, రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు అలాగే నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.