దేశ రాజధాని ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దాదాపు సున్నాకి పడిపోయింది. ఉదయం 10 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్థితి. పొగమంచు వల్ల ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. దాదాపు 80కిపైగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. ఫ్లైట్‌రాడార్24 ప్రకారం కనీసం 80 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటివరకూ ఐదు విమానాలు రద్దయ్యాయి.