AP: దళిత విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు అంబేద్కర్ నగర్ లో ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంటర్ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు 112కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న సుబ్రహ్మణ్యం కోసం గాలిస్తున్నారు.