మౌలాలిలోని నివాసానికి ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా పార్థివదేహం ఇవాళ తరలించనున్నారు. కడసారి విడ్కోలుకు, స్మరించుకోవడానికి, 14 అక్టోబర్ 2024(సోమవారం) ఉదయం 10 గంటల నుండి తమతో పాలుపంచుకునేందుకు ఆహ్వానిస్తున్నామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీనివాస హైట్స్ వద్ద నుండి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. సాయిబాబా కోరిక మేరకు ఆయన దేహాన్ని పరిశోధనల నిమిత్తం ఆసుపత్రికి అప్పగిస్తామని తెలిపారు.