ప్రపంచంలోనే (G20 దేశాలు) భారతీయ ఆహారం అత్యుత్తమమని స్విట్జర్లాండ్‌కు చెందిన WWF లివింగ్ ప్లానెట్ రిపోర్టు-2024 వెల్లడించింది. ఇండియన్లు ఎక్కువగా మొక్కల నుంచి వచ్చే ఆహారం తీసుకుంటారని, అప్పుడప్పుడు మాంసాహారం తీసుకోవడం వల్ల సుస్థిర ఆహార వినియోగాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. US, ఆస్ట్రేలియా, అర్జెంటీనా ఫుడ్ అత్యంత చెత్త ర్యాంకింగ్ నమోదు చేసిందని పేర్కొంది.