నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ స్వగృహంలో శుక్రవారం దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు మాజి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎనలేని సేవలందించారని డీసీసీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక మహా నాయకుడిని కోల్పోయిందన్నారు.