సంగారెడ్డి: రబీ సీజన్ ధాన్యం కొనుగోలుపై అధికారులతో మంత్రి సమీక్ష

56చూసినవారు
సంగారెడ్డి: రబీ సీజన్ ధాన్యం కొనుగోలుపై అధికారులతో మంత్రి సమీక్ష
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలు పై జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను అభ్యంతరాలు లేకుండా కొనుగోలు చేయాలని, సన్నాలను, దొడ్డు ధాన్యమును విడిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాలో ధాన్యపు కొనుగోలు కేంద్రాలను పెంచాలన్నారు.