అందోల్: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
అందోల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఏసు (36) భార్య వద్ద డబ్బులు తీసుకుని మద్యం తాగేవాడు. మంగళవారం మద్యానికి డబ్బులు అడిగితే భార్య ఇవ్వలేదని గొడవపడి ఇంట్లో నుండి వెళ్ళి గుడి దగ్గర పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.