మండలంలో భారీ వర్షం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో మంగళవారం రాత్రి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం చిరుజల్లులు పడగా, మధ్యాహ్నం ఆకాశం మేఘావృతంగా మారింది. తిరిగి రాత్రి ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల రోడ్లు జలమయంగా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.