కోహిర్: గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన అదనపు కలెక్టర్
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామంలో గల తెలంగాణ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా ఆదనపు కలెక్టర్ స్థానిక సంస్థల చంద్రశేఖర్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించి, పాఠశాల పరిసరాలను స్వయంగా పర్యవేక్షించారు. పాఠశాలకు సంబంధించిన పలు అంశాలను మండల అభివృద్ది అధికారి భారతి, ఆదనపు కలెక్టర్ కు క్లుప్తంగా వివరించారు.