బహుజన సమాజ్ పార్టీ జహీరాబాద్ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థి లక్ష్మి సిర్గపూర్ కళాశాలలో బిల్డింగ్ పైనుంచి చనిపోవడం అవాస్తవమని బీఎస్పీ పార్టీ ఖండించింది. జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ పీచరాగడి తండా ఇంటర్ విద్యార్థి రమావత్ లక్ష్మి సమాధికి బీఎస్పీ పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. మరణం చాలా దారుణమని కుటుంబ సభ్యులను పరామర్శించిన అసెంబ్లీ అధ్యక్షుడు ఆయుధాలు అలెగ్జాండర్ మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజవర్గం సిర్గాపూర్ గురుకుల పాఠశాలలో జరిగిన విద్యార్థి రమావత్ లక్ష్మి కుటుంబ సభ్యులు ఈ ఘటన ఎలా జరిగిందని సిర్గాపూర్ గురుకుల పాఠశాలకు తెలుసుకోవడానికి వెళ్తే ప్రిన్సిపల్ పోలీసులను పెట్టి కుటుంబ సభ్యులను కొట్టియడం జరిగిందని రోదిస్తున్నారని కుటుంబానికి బి ఎస్ పి పార్టీ న్యాయం జరిగేంత వరకు ఎప్పుడు మీ వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి అని సెక్రటరీ రోనాల్డ్ రోస్కు, బిఎస్పి పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో డి ప్రేమ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఇక్బాల్ షాప్, నియోజవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ వహీద్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మున్వార్ పటేల్, కోహిర్ మండల అధ్యక్షుడు సీనియర్ నాయకులు సుభాష్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.