చిన్నచెల్మెడలో జోరుగా కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ శుక్రవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రుద్ర కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.