సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో భోగేశ్వరస్వామికి శుక్రవారం రుద్రాభిషేకం, రుద్ర హోమం నిర్వహించారు. శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య ఆధ్వర్యంలో పార్థవలింగ, రుద్రాభిషేకం, శివపార్వతుల కల్యాణోత్సవం, కార్తీక దీపారాధన, గురువుగారి అమృత ఉపదేశం, మహా మంగళహారతి , అన్నప్రసాద వితరణ భజన కీర్తనలు చేపట్టారు.