ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు జరిగే డీఎస్సి 2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు 30 టైంలో ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఒక్కో టీంలో ఇద్దరు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఓ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు ఉంటారని చెప్పారు. అభ్యర్థుల అన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు పక్కాగా పరిశీలించాలని సూచించారు.