
ఖేడ్: రేపు సత్యనారాయణ స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు
నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ లోని బానపూర్ రోడ్ లో గల సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ఉగాది వేడుకల ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు చిన్ని మధుకర్ తెలిపారు. ఉదయం స్వామివారికి అభిషేకం, సాయంత్రం 5 గంటలకు చిన్ని మధుకర్ పంతులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులుకుటుంబ సభ్యులతో పాల్గొని పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాలన్నారు.