చాప్టా(కే) గ్రామంలో శివుని మహా పడిపూజ కార్యక్రమం

1543చూసినవారు
చాప్టా(కే) గ్రామంలో శివుని మహా పడిపూజ కార్యక్రమం
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని చాప్టా(కే)గ్రామంలో ఫిబ్రవరి 19న శివ దీక్ష స్వాముల మహాపడి పూజను నిర్వహిస్తున్నట్లు గ్రామ సన్నిధానం స్వాములు చెప్పారు. జనవాడే ఉమాకాంత్ స్వామి ఇంట్లో మధ్యాహ్నం 12గంటలకు పూజ కార్యక్రమం ఉంటుందని గురు స్వామి కొండ సాయిలు ఆదివారం తెలిపారు. ఈనెల 26వ తేదీన శివ దీక్ష స్వాములందరు కలిసి స్థానిక హనుమాన్ మందిరంలో మహాపడి పూజ కార్యక్రమం పెద్ద మొత్తంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్