సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులోని శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ఆదివారం మండల ఎస్ఐ కోటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సన్నిధిలో సీసీ కెమెరాలు పరిశీలించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎస్ఐ కోటేశ్వరరావు వారికి శాలువాతో సన్మానించారు.