బోరంచ దివ్య క్షేత్రంలో నల్ల పోచమ్మకు పూజలు

53చూసినవారు
బోరంచ దివ్య క్షేత్రంలో నల్ల పోచమ్మకు పూజలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం బోరంచ గ్రామ దివ్య క్షేత్రంలో నల్ల పోచమ్మకు భక్తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థిర వాసరే పురస్కరించుకొని ఆలయ అర్చకులు మూలవిరాట్ దేవికి పంచామృతాలు, మంజీరా నది గంగా జలంతో అర్చకులు అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణలో విశేష పూజలు చేపట్టారు. అమ్మవారిని కొలిచేందుకు దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్