వర్షానికి కూలిపోయిన శ్రీ రామ మందిరం పైకప్పు

64చూసినవారు
కంగ్టి మండలం బాబుల్ గాం గ్రామంలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి శ్రీరామ మందిరం పురాతన భవనం పైకప్పు కూలిపోయిందని స్థానికులు బుధవారం తెలిపారు. ఆలయం కూలిపోవడం పట్ల రామభక్తులు ఆందోళన చెందుతున్నారు. పెంకుటిల్లుతో కూడిన అతి పురాతన భవంతి ఇల్లు కావడంతో వర్షానికి బాగా తడిసి పై కప్పు కూలినట్లు చెప్పారు. గ్రామస్తులు సమావేశమై ఆలయ పునర్నిర్మాణం గురించి చర్చించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్