Jan 21, 2025, 02:01 IST/
తిరుమల అన్నప్రసాదం మెనూలో మార్పులు (వీడియో)
Jan 21, 2025, 02:01 IST
AP: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఇకపై మరింత రుచికరమైన ఆహారం అందించనుంది. ఈ మేరకు అన్నప్రసాదం మెనూలో పలు మార్పులు చేసింది. భక్తులకు భోజనంతో పాటూ మసాలా వడలు పెట్టాలని నిర్ణయించింది. ట్రయల్ రన్లో భాగంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా మసాలా వడలు తయారు చేసి దాదాపు 5 వేల మంది భక్తులకు వడ్డించింది. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా పూర్తిస్థాయిలో భక్తులకు వడ్డించేలా టీటీడీ చర్యలు చేపట్టింది.