AP: రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలోని గూడురులో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో రైలు పట్టా విరిగిపోయింది. ఈ క్రమంలోనే గొర్రెలు కాసేందుకు అటుగా వెళ్లిన ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని గమనించారు. రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.