సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. కార్యక్రమంలో సోమవారం విద్యార్థుల పేర్లు నమోదు, అంగన్వాడి కేంద్రాల్లో తల్లిదండ్రులకు అవగాహన, బడి బయట పిల్లలను గుర్తించుట గడపగడపకు కరపత్రాలు బ్యానర్లతో ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.