పటాన్చెరు నియోజకవర్గం, మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. 70 లక్షల రూపాయల నిధులతో భవనాలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. హాజరైన పిఎసిఎస్ అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకటరెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.