నాలా నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కార్పొరేటర్
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్, జ్యోతి నగర్ కాలనీ మధ్యలో నూతనంగా 95 లక్షల రూపాతీలతో నిర్మిస్తున్న నాలా నిర్మాణ పనులను శుక్రవారం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఈఈ సురేష్ తో కలిసి స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శేష రెడ్డి, పవన్, ఖలీమ్, శేఖర్ ఉన్నారు.