బీసీ కమిషన్ బహిరంగ విచారణకు హాజరుకాని మెదక్ సిద్దిపేట కలెక్టర్లపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. సంగారెడ్డి లోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిరంగ విచారణకు రెండు జిల్లాల కలెక్టర్లు హాజరు కాకపోవడం సరి కాదని పేర్కొన్నారు. మిగతా జిల్లాలో కూడా కలెక్టర్లు విచారణకు హాజరుకావాలని కోరారు.