రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కుల గణనలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భాగస్వామి కావాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని అంబేద్కర్ భవన్ లో శనివారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కులగణన వల్ల బీసీలకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి తోపాదజి అనంత కిషన్ నాయకులు పాల్గొన్నారు.