16న శ్రీరామ శిల శోభాయాత్ర

80చూసినవారు
శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన శ్రీరామ శిల శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని విద్యాపీఠంలో విద్యాపీఠంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 16న మధ్యాహ్నం 1 గంటకు పోతిరెడ్డిపల్లి సంగమేశ్వర దేవాలయం వద్ద శిలాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. యాత్రలో పదివేల మంది భక్తులు పాల్గొంటారని పేర్కొన్నారు. 13 కోట్ల రామనామ జపం యాత్రలో జరుగుతుందని అన్నారు. వెయ్యి మంది మహిళలు కళాశాల ధరిస్తారని వివరించారు. రాత్రి 8 గంటలకు పర్సనల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంకు యాత్ర చేరుకుంటుందని పేర్కొన్నారు భక్తులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజి అనంతకృష్ణ, ప్రశాంత్ కుమార్, సెంథిల్, విద్యాసాగర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్