అమెరికా సామ్రాజ్యవాద నిరంకుశత్వాన్ని ఒక్కరు ఖండించాలి

70చూసినవారు
అమెరికా సామ్రాజ్యవాద నిరంకుశత్వాన్ని ఒక్కరు ఖండించాలి
అమెరికా సామ్రాజ్యవాద నిరంకుశత్వాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అన్నారు. క్యూబాకు సంఘీభావంగా సిఐటియు ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ నుంచి కొత్త బస్టాండ్ వరకు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు మల్లేశం, కార్యదర్శి సాయిలు, కోశాధికారి రాజయ్య పాల్గొన్నారు.