సంగారెడ్డి పట్టణం సోమేశ్వరవాడలో భక్తుల కొంగు బంగారమై కొలువైయున్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదోష కాలంలో లింగ రూపంలో కొలువైన శ్రీ శివ మహా దేవునికి అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామి వారిని సర్వాలంకార భరితంగా అలంకరించి, నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. మహిళలు దీపోత్సవం జరిపారు.