సీపీఎం రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఈనెల 25వ తేదీన పోతిరెడ్డిపల్లిలోని పీఎస్ఆర్ మైదానంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి జయరాజ్ కోరారు. సంగారెడ్డిలోని కేబుల్ కిషన్ భవన్ లో బుధవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్, బీవీ రాఘవులు హాజరవుతారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.