సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేంజిలో శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో సంకష్ట చతుర్థి సందర్భంగా సోమవారం భక్తులు భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకం, సింధూర లేపనం చేసి సుగంధ పుష్పాలతో అలంకరించారు. కర్నాటక, మహారాష్ట్రలతో పాటు స్థానిక భక్తులు వేలాదిగా పాల్గొని ఆది పూజితుని దర్శించుకున్నారు.