సంగారెడ్డి: మహిళల ఓపెన్ జిమ్ బాగు చెయ్యండి సార్

65చూసినవారు
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని జిల్లా కలెక్టరేట్ వెనకాల ఉన్న పట్టణ ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన మహిళల ఓపెన్ జిమ్ పరికరాలు పూర్తిగా చెడిపోయాయని శుక్రవారం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వాకింగ్ పూర్తి అయిన తరువాత మహిళలు ఓపెన్ జిమ్‌ చేస్తారు. జిమ్ పరికరాలు పూర్తిగా చెడిపోవడంతో ఇబ్బంది ఏర్పడుతుందని మహిళలు అన్నారు. ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి ఓపెన్ జిమ్ బాగుచేయించాలని మహిళలు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్