వరసిద్ధి ఆలయంలో ప్రత్యేక పూజలు

73చూసినవారు
న్యాల్కల్ మండలం రేజింతల్ లోని శ్రీ వరసిద్ధి గణపతి ఆలయంలో జేష్ఠ మాసం సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో గణపతికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. స్వామివారికి మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్