Oct 28, 2024, 08:10 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
రేపు మైనార్టీ దుకాణాల బంద్ జయప్రదం చేయాలి
Oct 28, 2024, 08:10 IST
మహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈనెల 29వ తేదీన సంగారెడ్డిలో మైనార్టీ దుకాణాల బంద్ నిర్వహిస్తున్నట్లు ఉర్దూ అకాడమీ మాజీ వైస్ చైర్మన్ ఎం ఏ హకీమ్ తెలిపారు. సంగారెడ్డిలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.