క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బుధవారం ఝరాసంగం మండలంలోని బిడేకన్నా గ్రామ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి, కార్యదర్శి హర్ష వర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివ సాయి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.