
జహీరాబాద్: ప్రగతి చక్ర పురస్కారాలు అందజేసిన డీఎం
జహీరాబాద్ డిపో నందు డిపో మేనేజర్ డయల్ యువర్ డీఎం కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికుల నుండి 8 విజ్ఞప్తులు స్వీకరించారు. అందులో ముఖ్యంగా మహాలక్ష్మీ పథకం ద్వారా పెరిగిన ప్రయాణికుల సంఖ్య కు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచవలెనని.. బస్సు సర్వీసు కల్పించమని.. జహీరాబాద్ బీదర్ మధ్య షటిల్ సర్వీసులు నడపాలన్నారు.