శ్రీశైలంలోని శ్రీగిరి క్షేత్రంలో ఈ నెల 11న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఈ నెల 17వ తేదీతో ముగుస్తాయి. 12న ఉత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలుంటాయి. 13న కైలాస వాహనసేవపై భ్రమరాంబ అమ్మవారితో కలిసి మల్లికార్జునుడు విహరిస్తారు. 14న నందివాహన సేవ, బ్రహ్మోత్సవ కల్యాణం, 15న పూర్ణాహుతి, త్రిశూలస్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ, 17న అశ్వవాహన సేవ పుష్పోత్సవం, శయనోత్సవం ఉంటాయి.