సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. గ్రామాల్లోని చిన్నపిల్లలకు ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఎంచక్కగా పతంగులు ఎగురవేయొచ్చు. అయితే ఈ పతంగులు ఎందుకు ఎగురవేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు సూర్యకిరణాలు శరీరానికి ఔషధంగా పనిచేస్తాయి. కాబట్టి ఉదయాన్నే బయటకు వచ్చి పతంగులను ఎగురవేయడం వల్ల సూర్య కిరణాలు శరీరాన్ని తాకుతాయి. దీంతో శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది.