ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌‌ను నిర్ధారించే పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

52చూసినవారు
ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌‌ను నిర్ధారించే పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ప్రమాదకరమైన గ్లియోబ్లాస్టోమా అనే మెదడు క్యాన్సర్‌ను వేగంగా గుర్తించే సరికొత్త మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొత్తగా రూపొందించిన పరికరంతో కేవలం గంట వ్యవధిలోనే ఈ వ్యాధిని నిర్ధారించవచ్చని చెబుతున్నారు. రక్తపరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేసేందుకు ఓ ఆటోమేటెడ్ పరికరాన్ని అమెరికాలోని నాట్రదామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉందని.. అందుబాటులోకి వస్తే ధర కూడా రూ.168 కంటే తక్కువగా ఉండనున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్