రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో విజృంభిస్తోన్న సీజనల్ వ్యాధులు

71చూసినవారు
రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో విజృంభిస్తోన్న సీజనల్ వ్యాధులు
గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా.. రహదారుల వెంట పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2024లో హైదరాబాద్‌ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుపుతామన్న లక్ష్యం నీరుగారి పోతోంది. వాస్తవంగా వర్షాకాలంలో వ్యర్థాలు త్వరగా కుళ్లి దుర్గంధం వెదజల్లే పరిస్థితులే ఎక్కువ. అయితే చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వర్షాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. ఇప్పటికే మలేరియా, డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్