ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఒక సొసైటీలోగల ఆలయానికి ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(UPPCB) నుంచి నోటీసు వచ్చింది. గౌర్ సౌందర్య సొసైటీలో గల గుడిలో గంటలు మోగించడం వలన శబ్ద కాలుష్యం ఏర్పడుతున్నదని అక్కడ నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. శబ్ద కాలుష్యాన్ని తనిఖీ చేసి ఆ గంట నుంచి 70 డెసిబుల్స్ శబ్ధం వస్తున్నదని గుర్తించి UPPCB నోటీసులు పంపింది. దీనిపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేయగా నోటీసులు ఉపసంహరించుకుంది.