ఉక్రెయిన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి అధ్యక్షుడు జెలెన్ స్కీ తో కలిసి ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియంను సందర్శించారు. ఇక్కడ యుద్ధంలో చనిపోయిన చిన్నారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన చిన్నారులకు నివాళిగా బొమ్మను ఉంచారు. 'ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారు దుఃఖం నుంచి బయటపడే శక్తిని పొందాలని నేను ప్రార్థిస్తున్నాను' అని ప్రధాని మోదీ అన్నారు.