విమానం గాల్లో ఉండగానే ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న ఏపీకి చెందిన మహిళ మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చారు. విజయవాడకు చెందిన దీప్తి(28) సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరారు. గురువారం విమానం గాల్లో ఉన్నప్పుడే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్ సహాయంతో గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చారు.