యుద్ధానికి ఇది సమయం కాదని, పుతిన్ కళ్లలోకి చూసి చెప్పానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో అన్నారు. ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన మోదీ కీవ్ లో జెలెన్ స్కీతో సమావేశమయ్యారు. "రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ తటస్థంగానో, ఉదాసీనంగానో లేదు. ఎల్లప్పుడూ శాంతి పక్షానే ఉంది" అని జెలెన్ స్కీతో మోదీ చెప్పారు. అనంతరం ఇరువురు నాయకులు వాణిజ్య వ్యవహారాలపై చర్చించారు.