కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భోలానాథ్ పాండే (71) కన్నుమూశారు. లక్నోలోని స్వగృహంలో శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. ఇక 1978 డిసెంబర్ 20న ఆయన సంచలనానికి తెర తీశారు. అరెస్ట్ అయిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీని విడుదల చేయాలని ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC 410ని బొమ్మ తుపాకీ చూపించి 'హైజాక్' చేశారు. ఈ కేసులో ఆయన తర్వాత తీహార్ జైలులో శిక్ష అనుభవించారు.