హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటికి భద్రత పెంపు

58చూసినవారు
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటికి భద్రత పెంపు
తెలంగాణలో హైడ్రా పెను సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ చెరువులను, నాలాలు, కుంటలను, ప్రభుత్వ, ఎండోమెంట్ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అక్రమంగా నిర్మించిన భవనం, కట్టడం ఎవరిదనే విషయం పట్టించుకోకుండా హైడ్రా ముందుకు సాగుతుంది. పలువరు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటికి భద్రత పెంచింది.

సంబంధిత పోస్ట్